నాకు 26 ఏళ్ల వయసున్నప్పుడు ఓ అమ్మాయి మీద మనసుపడ్డా: మహేశ్ బాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు 26 ఏళ్ల వయసున్నప్పుడు ఓ అమ్మాయి మీద మనసుపడ్డా: మహేశ్ బాబు

mahesh babu about love with namrata
  • ఎవరి మీదైనా క్రష్‌ ఉందా? అన్న ప్రశ్నకు సమాధానం
  • ఓ అమ్మాయిని ప్రేమించి  పెళ్లి చేసుకున్నానని జవాబు
  • ఆమే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని వ్యాఖ్య
  • ఆమె ఎవరో కాదు నమ్రత అన్న మహేశ్
తన ప్రేమ, పెళ్లి గురించి టాలీవుడ్‌ హీరో మహేశ్ బాబు ఆసక్తికర విషయాలు తెలిపాడు. తాజాగా ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.  ఎవరి మీదైనా మనసుపడ్డారా? (ఎవరి మీదైనా క్రష్‌ ఉందా?) అంటూ ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పాడు. తనకు 26 ఏళ్ల వయసున్నప్పుడు ఓ అమ్మాయి మీద మనసుపడ్డానని చెప్పాడు. అనంతరం ఆమెను పెళ్లి చేసుకున్నానని, ఆమే తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అని, ఆమె ఎవరో కాదు నమ్రత అని చెప్పాడు.

కాగా, తన పిల్లలు గౌతమ్‌, సితారల్లో ఎవరంటే ఎక్కువ ఇష్టమని ఒకరు అడగగా వారిద్దరూ తనలో భాగమని, ఇద్దరూ ఒకటేనని చెప్పాడు. భవిష్యత్తులో తన కుమారుడు గౌతమ్‌ హీరో అవుతాడా? అన్న ప్రశ్నకు మహేశ్ స్పందిస్తూ.. వాడికి హీరో అవ్వాలని ఉందనుకుంటున్నానని, అయితే, ఈ ప్రశ్నకు కాలమే సమాధానం చెబుతుందని చెప్పాడు.
Mahesh Babu
namrata
Tollywood

More Telugu News