వెండి తెరపై కరణం మల్లేశ్వరి జీవిత చరిత్ర... అధికారికంగా ప్రకటించిన కోన!
- ఒలింపిక్స్ పతకం సాధించిన తొలి భారత మహిళ మల్లేశ్వరి
- నేడు కరణం మల్లేశ్వరి పుట్టిన రోజు
- బయోపిక్ ను తీయనున్నామన్న కోన వెంకట్
నేడు కరణం మల్లేశ్వరి పుట్టిన రోజు కాగా, మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎంవీవీ సినిమా, కేఎఫ్సీ (కోనా ఫిల్మ్ కార్పొరేషన్) ఈ సినిమాను నిర్మించనున్నట్టు కోన వెంకట్ తెలిపారు. ఇది పాన్ ఇండియా చిత్రమని ఆయన స్పష్టం చేశారు. అయితే, సినిమాలో కరణం మల్లేశ్వరి పాత్రను చేసే హీరోయిన్ ఎవరన్న విషయాన్ని వెల్లడించలేదు. ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సినిమాలో నటీనటులు, ఇతర వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.