మహేశ్ బాబు మెడపై రూపాయి బిళ్ల పచ్చబొట్టు.. ‘స‌ర్కారు వారి పాట‌’ టైటిల్ లోగో ఇదిగో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మహేశ్ బాబు మెడపై రూపాయి బిళ్ల పచ్చబొట్టు.. ‘స‌ర్కారు వారి పాట‌’ టైటిల్ లోగో ఇదిగో

mahesh new movie logo
  • సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల 
  • చెవిపోగు, కొత్త హెయిర్‌ స్టైల్‌తో మహేశ్
  • మ‌హేశ్ తన కెరీర్‌లో నటిస్తోన్న 27వ సినిమా
సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుమారుడు మ‌హేశ్ బాబు ‘స‌ర్కారు వారి పాట‌’కు సంబంధించి టైటిల్ లోగోను ఆ సినిమా యూనిట్  ఈ రోజు విడుద‌ల చేసింది. ఇందులో మహేశ్ బాబు ముఖాన్ని కొంత భాగం చూపించారు. ఆయన మెడపై రూపాయి బిళ్ల పచ్చబొట్టు పొడిపించుకుని ఉండడం ఇందులో చూడొచ్చు.

అలాగే, చెవిపోగు, కొత్త హెయిర్‌ స్టైల్‌తో మహేశ్ కనపడుతున్నాడు. మ‌హేశ్ తన కెరీర్‌లో నటిస్తోన్న 27వ సినిమా ఇది. ఈ సినిమాకు పరశురాం పెట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాలు నిర్మిస్తున్నాయి.

Mahesh Babu
Tollywood
Twitter

More Telugu News