వలస కూలీల పట్ల ఓ రైతు ఔదార్యం: వెళ్లేందుకు విమాన టికెట్లు.. దారి ఖర్చులకు తలా రూ. 3 వేలు!
- లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయిన పదిమంది కూలీలు
- వారి బాగోగులు చూసుకున్న రైతు
- రూ. 68 వేలతో బీహార్ వెళ్లే ఫ్లైట్ టికెట్లు
దీంతో వారి బాధలు చూసి చలించిపోయిన రైతు వారిని ఎలాగైనా ఇంటికి పంపాలని అనుకున్నాడు. వారి ఫిట్‌నెస్‌ను నిరూపించే ధ్రువపత్రాలు తీసుకున్నాడు. రూ. 68 వేలు పెట్టి నేడు పాట్నా వెళ్లే విమానానికి టికెట్లు కొనిచ్చాడు. అంతేకాదు దారిఖర్చుల నిమిత్తం తలా రూ. 3 వేలు ఇచ్చి స్వయంగా తన వాహనంలోనే విమానాశ్రయంలో దింపి వచ్చాడు. తన యజమాని చూపించిన ప్రేమకు కూలీలు చలించిపోయి కృతజ్ఞతలు తెలిపారు.