RGV: చెప్పినట్టే కరోనా వైరస్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ!

  • లాక్ డౌన్ రోజుల్లో కరోనా వైరస్ చిత్రం తెరకెక్కించిన వర్మ
  • ఇవాళ సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేస్తానని వెల్లడి
  • తమనెవరూ ఆపలేరంటూ ట్వీట్
RGV releases Corona Virus trailer

విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్రేడ్ మార్కుకు మరోసారి న్యాయం చేస్తూ, సమకాలీన సమస్య కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా వైరస్ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. లాక్ డౌన్ రోజుల్లో ఓ సినిమా తీయడం అనేది వర్మకే చెల్లుతుందని చెప్పాలి. అది కూడా కరోనాపైనే కావడం విశేషం.

 ఇక ఈ సినిమా ట్రైలర్ ను ఈ సాయంత్రం రిలీజ్ చేశారు. ఓ కుటుంబంలో కరోనా ఎలాంటి ప్రభావం చూపిందన్నది కథాంశంగా తెలుస్తోంది. ఇంట్లో ఓ అమ్మాయి జలుబు, దగ్గుతో బాధపడుతుంటే తోబుట్టువులే పక్కన కూర్చునేందుకు జంకడం ఈ ట్రైలర్ లో చూడొచ్చు. మొత్తమ్మీద ఓ ఇంటికే పరిమితమైన కథతో వర్మ ఈ చిత్రాన్ని రూపొందించినట్టు అర్థమవుతోంది. ఈ సినిమాలో తెలిసిన ముఖాలు ఒక్కరూ లేరు. అంతా కొత్తవాళ్లే! అయితే ఈ చిత్రాన్ని వర్మ థియేటర్లలో రిలీజ్ చేస్తాడా, లేక, ఓటీటీ వేదికలపై రిలీజ్ చేస్తాడా? అన్నది చూడాలి.


More Telugu News