ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టులో విచారణ ఈ నెల 28కి వాయిదా
- ప్రభుత్వ భూముల అమ్మకంపై హైకోర్టులో పిల్
- విచారణ చేపట్టిన న్యాయస్థానం
- ఉన్న భూములు అమ్ముకోవడం ఏంటన్న న్యాయస్థానం
విచారణ సందర్భంగా హైకోర్టు ప్రభుత్వాన్ని అనేక విధాలా తప్పుబట్టిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వెల్లడించారు. ఓవైపు ఇళ్ల స్థలాల కోసం భూములు కొనుగోలు చేస్తూ, మరోవైపు ప్రభుత్వ భూములు అమ్ముకోవడం ఏంటి? అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసిందని వివరించారు. ఆదాయం కోసం ఇతర మార్గాలు అన్వేషించాలి కానీ, ప్రభుత్వ భూములు అమ్ముకోవడం సబబు కాదని హితవు పలికిందని న్యాయవాది తెలిపారు.