Karnataka: వధూవరుల నోటికి మాస్కులు తొడిగిన బీజేపీ ఎమ్మెల్యే.. వధువుకి వరుడు, వరుడికి వధువు కూడా.. ఫొటోలు ఇవిగో

  • కర్ణాటకలో ఈ రోజు ఒక్కటైన పలు జంటలు
  • పెళ్లికి అనుమతులు ఇవ్వడంలో వివాహ వేడుకలు
  • మాస్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
masks for couple

కర్ణాటకలో ఈ రోజు ఒక్కటైన పలు జంటలకు బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య మాస్కులను గిప్టుగా అందించారు. కొందరు వధూవరులకు ఆయనే స్వయంగా మాస్కులు తొడిగారు. దెవనాగెరెలోని హొన్నాళీలో ఈ రోజు పలు జంటలు వివాహ బంధంతో ఒక్కటయ్యాయి.

               
ఇప్పటికే పెళ్లి నిశ్చయం చేసుకున్న వారికి మే 24, 31 మధ్య లాక్‌డౌన్‌లోనూ పెళ్లి చేసుకునే అవకాశం కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అన్ని జాగ్రత్తలు తీసుకుని పెళ్లి చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ రోజు పలు ప్రాంతాల్లో కొందరు పెళ్లిళ్లు చేసుకున్నారు. పలు పెళ్లిళ్లకు అతిథిగా హాజరైన రేణుకాచార్య ఇలా మాస్కులు పంపిణీ చేశారు.
                                   

More Telugu News