Sekhar Kammula: మరో చిత్రానికి ఓకే చెప్పిన శేఖర్ కమ్ముల!

  • లవ్ సబ్టెక్టుపై ఆసక్తి చూపిస్తున్న శేఖర్ కమ్ముల!
  • స్టార్ హీరోతో చిత్రం
  • త్వరలో అధికారిక ప్రకటన 
Sekhar Kammula next is a love story

దర్శకుడు శేఖర్ కమ్ముల నెక్ట్స్ తీయబోయే సినిమాపై స్పష్టత వచ్చింది. ఫిదా చిత్రం తర్వాత శేఖర్ కమ్ముల 'లవ్ స్టోరీ' పేరిట నాగచైతన్య, సాయిపల్లవితో చిత్రం చేస్తున్నాడు. ఇప్పుడాయన మరో సినిమాకు అంగీకారం తెలిపారు. ఓ అందమైన ప్రేమకథను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి కూడా 'లవ్ స్టోరీ' నిర్మాత నారాయణదాస్ నారంగ్ నిర్మాతగా వ్యవహరిస్తారు. కాగా, ఈ లవ్ సబ్జెక్ట్ కోసం శేఖర్ కమ్ముల ఓ స్టార్ హీరోను తీసుకోవాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

More Telugu News