వైరల్ అవుతున్న హీరోయిన్ రెజీనా ఫొటోలు.. గుర్తు పట్టలేకపోతోన్న ఫ్యాన్స్‌

23-05-2020 Sat 11:49
  • పాత తరం హీరోయిన్‌లా ఫొటోలు
  • ఫొటో షూట్ కోసం పోజులు?
  • రెజీనాయేనా? అని ప్రశ్నిస్తోన్న ఫ్యాన్స్
regina pics

పాత తరం హీరోయిన్‌లా మారిపోయి రెజీనా పలు ఫొటోలు పోస్ట్ చేసింది. ఆ ఫొటోల్లో ఉన్నది రెజీనాయేనని ఫ్యాన్స్‌ కూడా గుర్తు పట్టలేకపోతున్నారు. సోషల్ మీడియాలో రెజీనా ఫొటోలు చూసిన అభిమానులు, ఈమె మా రెజీనాయేనా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆమె ఇలా ఎందుకు మారిపోయింది? అని ప్రశ్నిస్తున్నారు. ఫొటో షూట్ కోసం ఆమె ఇలా చేసిందని తెలుస్తోంది.
                               
       
తమిళనాడుకు చెందిన ఈ భామ టాలీవుడ్ పరిశ్రమకు వచ్చి ఇక్కడ మంచి పేరు తెచ్చుకుంది. 'మెగా' హీరోలతో వరసగా సినిమాలు చేసింది. చిరంజీవి 'ఆచార్య' సినిమాలో ఐటమ్ సాంగ్ లో కనపడనుంది. ఇటీవలే ఎవరు సినిమాతో ఆమె మంచి విజయాన్ని అందుకుంది.