Special Buses: హైదరాబాదులో ప్రభుత్వ ఉద్యోగుల కోసం రేపటి నుంచి ప్రత్యేక బస్సులు

  • హైదరాబాదులో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
  • సిటీ బస్సులను అనుమతించని వైనం
  • ఉద్యోగుల కోసం 32 రూట్లలో తిరగనున్న ప్రత్యేక బస్సులు
Special buses for government employs in Hyderabad

హైదరాబాదులో కరోనా వ్యాప్తి అధికంగా ఉండడంతో సిటీ బస్సులకు, మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వలేదు. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం హైదరాబాదులో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఈ బస్సులు రేపటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాదులోని 32 రూట్లలో ఈ బస్సులు నడపనున్నారు. ఉద్యోగులు ఐడీ కార్డులు చూపిస్తేనే బస్సుల్లోకి అనుమతిస్తారు.

More Telugu News