Student: ఎంటెక్ విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఉప్పల్ ప్రొఫెసర్ కు అరదండాలు!

  • విద్యార్థినితో సన్నిహితంగా మెలిగిన అసిస్టెంట్ ప్రొఫెసర్
  • ఆ చిత్రాలను పంపించి బ్లాక్ మెయిల్
  • అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
Police Arrested Professor for Harrasment on his Student

తన వద్ద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసిన ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే, కరీంనగర్ జిల్లా అచ్చంపల్లికి చెందిన కోలా హరీశ్ అనే వ్యక్తి, ఉప్పల్ సమీపంలో నివాసం ఉంటూ, ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. అక్కడే చదువుతున్న ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఫోన్లు, చాటింగ్ ల తరువాత, తనను ప్రేమించాలని ఒత్తిడి తెచ్చాడు.

అతనితో ప్రేమ ఇష్టంలేని ఆ యువతి దూరం పెట్టడం ప్రారంభించింది. హరీశ్ ఫోన్లు చేసినా, మెసేజ్ లు పెట్టినా పట్టించుకోలేదు. తనను దూరం పెడుతోందని భావించి, కోపం పెంచుకున్న హరీశ్, తనతో సన్నిహితంగా ఉన్న చిత్రాలను ఆమెకు, ఆమె కుటుంబీకులకు పంపించాడు. తనతో గతంలో ఉన్నట్టుగానే ఉండకుంటే, వీటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. టెక్నికల్ ఎవిడెన్స్ ను కలెక్ట్ చేసిన పోలీసులు, హరీశ్ ను అదుపులోకి తీసుకున్నారు.

More Telugu News