Ram: హీరో రామ్ ‘రెడ్’ నుంచి మాస్ సాంగ్ ‘డింఛక్..’ విడుదల

  • ఇవాళ  హీరో రామ్ పుట్టినరోజు 
  • ‘డింఛక్.. సాంగ్ వీడియో విడుదల చేసిన చిత్రయూనిట్
  • ఈ సినిమాలో తనకు నచ్చిన పాటల్లో ఇదొకటన్న రామ్
Teaser from Red movie

ఇవాళ టాలీవుడ్ హీరో రామ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘రెడ్’ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలోని మాస్ సాంగ్ గ్లింప్స్ ‘డింఛక్..’ వీడియోను విడుదల చేసింది. ‘రెడ్’ మూవీలోని పాటల్లో తనకు నచ్చిన ఓ సాంగ్ ఇది అని రామ్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు. కాగా, స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో నివేథా పేతురాజ్, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

More Telugu News