Palghar: పాల్గర్ కేసులో సాధువుల న్యాయవాది యాక్సిడెంటులో దుర్మరణం... అనుమానాలు వ్యక్తం చేస్తున్న బీజేపీ!

Lawyer in Palbhar Bob Linching Case died in Accident
షార్ట్స్‌లో చూడండి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్గర్ మూకదాడి కేసులో సాధువుల తరఫున వాదిస్తున్న న్యాయవాది దిగ్విజయ్ త్రివేది ఓ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఇదే కేసు వాదనల నిమిత్తం ఆయన కారులో వెళుతుండగా, ముంబై - అహ్మదాబాద్ నేషనల్ హైవేపై ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన ఆయన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఆ సమయంలో కారులో ఆయనతో పాటు మరో మహిళ కూడా ఉండగా, ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి.

కాగా, ఈ యాక్సిడెంట్ పై బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సాధువుల తరఫున వాదిస్తున్నందుకు ఎవరైనా కుట్ర చేశారా? అన్న అనుమానం తమకుందని పార్టీ నేత సంబిత్ పత్రా వ్యాఖ్యానించారు. గతంలో ఈ కేసును వెలుగులోకి తెచ్చిన వారిపై కాంగ్రెస్ నేతలు దాడులకు దిగారని గుర్తు చేశారు. ఈ కారు ప్రమాదంపై ఆర్డీఓ స్థాయి అధికారి విచారణ నిర్వహిస్తుండగా, నివేదిక వచ్చిన తరువాత నిజానిజాలు వెల్లడవుతాయని త్రివేది సహచర న్యాయవాది పీఎన్ ఓజా అభిప్రాయపడ్డారు.
Go Back to Shorts
Palghar
Lawyer
Accident
Road Accident
Died
BJP

More Telugu News