nikhil: నిఖిల్‌ పెళ్లి: హుషారుగా తలంబ్రాలు పోసుకున్న వధూవరులు

  • శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో పెళ్లి
  • బయటకు వస్తోన్న ఫొటోలు, వీడియోలు
  • తలంబ్రాల తంతులో హుషారుగా పాల్గొన్న హీరో
Hero Nikhil Marriage Video

టాలీవుడ్‌ యువ కథానాయకుడు నిఖిల్ ఓ ఇంటివాడయిన విషయం తెలిసిందే. ఆయన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువుల మధ్య డాక్టర్ పల్లవి వర్మని సంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నాడు. శామీర్‌పేట్‌లోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లో ఈ రోజు ఉదయం జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. తలంబ్రాల తంతులో వధూవరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

కాగా, నిన్న సాయంత్రం పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని చేసే కార్యక్రమం కూడా నిరాడంబరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లి వేడుకకు మీడియాను కూడా అనుమతించలేదు. పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను నిఖిల్‌తో పాటు ఆయన బంధువులు పోస్ట్ చేస్తున్నారు.

           

More Telugu News