Nara Lokesh: ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదు, వైఎస్ జగన్ గారు: లోకేశ్

lokesh fires on ycp leaders
షార్ట్స్‌లో చూడండి
విశాఖపట్నం సమీపంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలోని ఓ పరిశ్రమలో గ్యాస్ లీకేజ్‌కు కారణమైన వారిపై చర్యలు తీసుకోని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బాధితులపై అకారణంగా కేసులు పెడుతోందని టీడీపీ నేత నారా లోకేశ్ ఆరోపించారు. ఇది సిగ్గుమాలిన చర్య అంటూ ట్వీట్ చేశారు.

'ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ కంపెనీ పై కేసులు లేవు.. అరెస్టులు లేవు. గ్యాస్ లీకేజ్ కారణంగా ముక్కు పచ్చలారని పసికందుని కోల్పోయిన తల్లిదండ్రులపై కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? ఇంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉండదు వైఎస్ జగన్ గారు' అని ఆయన ట్వీట్ చేశారు.


Go Back to Shorts
Nara Lokesh
Telugudesam
YSRCP

More Telugu News