Bear: టర్నింగ్ లో డేంజర్ సైన్ కోన్ ను సరిచేసి వెళ్లిన ఎలుగుబంటి... వీడియో చూసి మెచ్చుకుంటున్న నెటిజన్లు!

  • సైన్ బోర్డును సరిచేసిన ఎలుగు
  • వీడియో షేర్ చేసిన ఐఎఫ్ఎస్ అధికారి
  • వైరల్ అయిన వీడియో
Bear Adjust Red sign Cone on Road

ఈ వీడియోను ఎప్పుడు, ఎవరు తీశారో తెలియరాలేదుగానీ, ఇందులో ఓ ఎలుగుబంటి చేసిన పనిని చూసిన వారు మాత్రం, దాని తెలివితేటలను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కాశ్వాన్ దీన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు.

ఓ రహదారిపై ఉన్న టర్నింగ్ వద్ద, వాహనదారులకు ముందు జాగ్రత్త హెచ్చరికగా ఏర్పాటు చేసిన రెడ్ కలర్ సైన్ కోన్ కింద పడిపోయింది. ఆ దారిలో వెళుతున్న ఓ ఎలుగుబంటి, తనకెవరో చెప్పినట్టుగా, దాని వద్దకు వెళ్లి, సరిచేసి, తిరిగి నిలబెట్టింది. ఆ దారిలో వెళ్లిన వాహనదారులు ఎవరూ దీన్ని తిరిగి నిలపాలని ఆలోచించను కూడా లేదు. వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూడవచ్చు.

More Telugu News