ప్రభాస్ సినిమా కోసం రంగంలోకి హాలీవుడ్ సాంకేతిక నిపుణులు

Vyjayanthi  Movies
  • 300 కోట్లతో సోషియో ఫాంటసీ
  • వివిధ భాషలకి చెందిన నటీనటులు
  • సూపర్ హీరోగా కనిపించనున్న ప్రభాస్  
ప్రభాస్ తాజా చిత్రంగా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఈ సినిమా తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ను నాగ్ అశ్విన్ పూర్తిచేశాడు.

ఇక ఇది పాన్ ఇండియా మూవీ అనీ .. హాలీవుడ్ సినిమాను గుర్తు చేస్తుందని నాగ్ అశ్విన్ స్వయంగా చెప్పాడు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 300 కోట్ల వరకూ ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అందువలన వివిధ భాషలకి చెందిన ప్రముఖ నటీనటులను ముఖ్యమైన పాత్రల కోసం తీసుకుంటున్నారు.

అలాగే పలు హాలీవుడ్ సినిమాలకి పనిచేసిన సాంకేతిక నిపుణులను ఈ సినిమా కోసం ఎంపిక చేసుకుంటున్నారట. అందుకు సంబంధించిన పనులు జరిగిపోతున్నాయని అంటున్నారు. భారీ బడ్జెట్ తో కూడుకున్న సినిమా కావడంతో, ప్లానింగ్ లో ఎక్కడా తేడా రాకుండా నాగ్ అశ్విన్ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అంటున్నారు. ఆయన ఈ సినిమాలో ప్రభాస్ ను సూపర్ హీరోగా చూపించనున్నాడనే అంశమే అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
Go Back to Shorts
Prabhas
Nag Ashwin
Vyjayanthi Movies

More Telugu News