నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అదనపు పీఎస్ ను విచారించిన సీఐడీ
- కేంద్రానికి నిమ్మగడ్డ రాసిన లేఖ విషయమై విచారణ
- ఆ లేఖ ఆధారాలు లేకుండా పోవడంపై ఆరా
- హైదరాబాద్ లోని ఏపీ సీఐడి కార్యాలయంలో సాంబమూర్తి విచారణ
హైదరాబాద్ లోని ఏపీ సీఐడీ కార్యాలయంలో సాంబమూర్తిని విచారిస్తున్నారు. కాగా,సీఐడీ ఏడీజీ వీపీ సునీల్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంబమూర్తిని కొన్ని రోజుల క్రితం విచారించింది. సాంబమూర్తి నుంచి మరికొన్ని వివరాలు రాబట్టే నిమిత్తం ఇవాళ కూడా విచారించింది.