Kaira Advani: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • బాలీవుడ్ నటికి మూడు భారీ ఆఫర్లు 
  • హిందీలోకి మరో టాలీవుడ్ హిట్
  • మరో తెలుగు సినిమాలో దుల్ఖర్
Kaira Advani in talks for three big flicks

 *  గతంలో 'భరత్ అనే నేను', 'వినయ విధేయ రామ' వంటి చిత్రాలలో నటించిన కైరా అద్వానీ ఆ తర్వాత బాలీవుడ్ లో బిజీఅయిపోయింది. అయితే, ఇప్పుడు ఆమెకు టాలీవుడ్ నుంచి మూడు బిగ్ ఆఫర్లు వెళ్లినట్టు తెలుస్తోంది. మహేశ్ బాబు- పరశురాం కాంబినేషన్ చిత్రం, ఎన్టీఆర్- త్రివిక్రమ్ సినిమా, ప్రభాస్-నాగ్ అశ్విన్ చిత్రం కోసం ఆమెను అడుగుతున్నట్టు సమాచారం.
*  ఇటీవలి కాలంలో తెలుగు హిట్ సినిమాలను బాలీవుడ్ లోకి రీమేక్ చేయడం పెరిగింది. ఆ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ కూడా త్వరలో రీమేక్ కానుంది. రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీ వెర్షన్లో రణబీర్ కపూర్ నటిస్తున్నాడు.
*  కొన్ని అనువాద చిత్రాలతో పాటు ఆమధ్య వచ్చిన 'మహానటి' చిత్రంలో కూడా నటించిన మలయాళ హీరో దుల్ఖర్ సల్మాన్ త్వరలో మరో తెలుగు సినిమాలో నటించనున్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందే ఓ చిత్రంలో దుల్ఖర్ నటిస్తాడని తెలుస్తోంది.    

More Telugu News