Trivikram Srinivas: త్రివిక్రమ్ మూవీలో బడా బిజినెస్ మేన్ గా ఎన్టీఆర్

  • త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ
  • రాజకీయాల నేపథ్యంలో సాగే కథ
  • హీరోయిన్ గా బాలీవుడ్ భామ
Trivikram Srinivas Movie

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మధ్య వచ్చిన 'అల వైకుంఠపురములో' భారీ విజయాన్ని సాధించింది. ఆ తరువాత సినిమాను ఆయన ఎన్టీఆర్ తో ప్లాన్ చేసుకున్నాడు. రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు. అప్పటి నుంచి ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎలా కనిపించనున్నాడనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమాలో ఆయన బడా బిజినెస్ మేన్ గా కనిపించనున్నాడనేది తాజా సమాచారం. అందుకు తగినట్టుగానే ఎన్టీఆర్ లుక్ ఉంటుందని అంటున్నారు. ఈ పాత్రను త్రివిక్రమ్ చాలా స్టైలీష్ గా తీర్చిదిద్దాడట. ఎన్టీఆర్ బాడీ లాగ్వేజ్ ఒక రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. రాజకీయాలను నేపథ్యంగా చేసుకుని, లవ్ ను .. ఎమోషన్స్ ను కలుపుకుని ఈ కథ నడుస్తుందని అంటున్నారు. కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా సమాచారం.

More Telugu News