Telangana: తెలంగాణలో 943కు చేరిన ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య
తెలంగాణలో ‘కరోనా’ పాజిటివ్ కేసుల సంఖ్య 943కు చేరింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మీడియా బులిటిన్ ను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. ఆసుపత్రుల్లో 725 మంది బాధితులు చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు 194 మంది డిశ్చార్జి అయ్యారని, 24 మంది మృతి చెందారని పేర్కొంది.