Koratala Siva: 'ఇదిగో అన్నయ్యా' అంటూ.. ఎన్టీఆర్ ఛాలెంజ్ ను పూర్తి చేసిన కొరటాల శివ!

koratala shiva accepts  be the real man challenge from NTR
షార్ట్స్‌లో చూడండి
లాక్‌డౌన్‌లో ఇంట్లో మహిళలకు సాయం చేయాలని  చెబుతూ  యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా  విసిరిన ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ టాలీవుడ్‌లో ట్రెండింగ్ గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఈ సవాల్ స్వీకరించిన దర్శకుడు కొరటాల శివ ఇంటి పనులు చేశారు.

వంట గదిలో గిన్నెలు కడిగారు. డైనింగ్‌ టేబుల్‌ను శుభ్రం చేశారు. ఆపై, ఇల్లు కూడా తుడిచి తన భార్యతో కలిసి ఫొటోకు పోజిచ్చారు.  ఇదిగో అన్నయ్య  (ఎన్టీఆర్) అంటూ  ఈ వీడియోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ‘మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా, రాను రాను అలవాటయ్యి, ఇప్పుడు సరదా అయింది’ అని ట్వీట్ చేశారు. ఈ ఛాలెంజ్‌కు హీరో విజయ్ దేవరకొండను నామినేట్ చేస్తున్నట్టు తెలిపారు.

Go Back to Shorts
Koratala Siva
Junior NTR
BE THE REAL MAN
CHALLENGE

More Telugu News