'పుష్ప'లో మరో లుక్ తోను కనిపించనున్న బన్నీ

Pushpa Movie
  • అడవి నేపథ్యంలో సాగే కథ
  • లారీ డ్రైవర్ పాత్రలో బన్నీ
  • మాఫియా డాన్ గా మరో లుక్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ 'పుష్ప' సినిమా చేయనున్నాడు. లాక్ డౌన్ ముగిసిన తరువాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకు వెళ్లనుంది. అడవి నేపథ్యంలో సాగే ఈ సినిమాలో రష్మిక గిరిజన యువతిగా కనిపించనుందని అంటున్నారు. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేసే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. ఆయన మాస్ లుక్ కి సంబంధించి వదిలిన పోస్టర్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

సినిమా మొత్తం అల్లు అర్జున్ ఇదే లుక్ తో కనిపిస్తాడని అనుకున్నారు. కానీ స్టైలీష్ మాఫియా డాన్ గా ఆయన మరో లుక్ తోను కనిపించనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుందట. ఆ ఎపిసోడ్ లో బన్నీ మాఫియా డాన్ గా కనిపిస్తాడని చెబుతున్నారు. ఆ లుక్ కి సంబంధించిన ఫొటో షూట్ ను ప్లాన్ చేస్తున్నారట. కొత్తగా బయటికి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ఈ సినిమా మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa Movie

More Telugu News