'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ జోడీ మారే ఛాన్స్?

RRR Movie
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఈ సినిమా ఇప్పటికే 75 శాతం చిత్రీకరణను జరుపుకుంది. చరణ్ - అలియా భట్, ఎన్టీఆర్ - ఒలీవియా కాంబినేషన్లోని సీన్స్ చిత్రీకరణ మాత్రమే మిగిలిపోయిందట. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టులో ఒలీవియా ఉండకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ ను పూర్తిస్థాయిలో ఇప్పట్లో ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదు. ఒలీవియా లండన్ ఆర్టిస్ట్ .. అందువలన ఆమెకి ఇక్కడికి వచ్చే అవకాశాలు తక్కువనే అంటున్నారు. అలియా భట్ ముంబై కనుక, ఆమె వలన పెద్దగా సమస్య ఉండకపోవచ్చు. ఇప్పటికే షూటింగు ఆలస్యం అయింది కనుక, లాక్ డౌన్ కారణంగా ఒలీవియా లండన్ నుంచి రాలేని పరిస్థితులు వుంటే, ఆమెను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించే అవకాశాలు లేకపోలేదనే ఒక టాక్ వినిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Go Back to Shorts
Junior NTR
Charan
Alia Bhatt
Oliviya

More Telugu News