Junior NTR: ఎన్టీఆర్ .. అట్లీ కుమార్ కాంబేషన్ ను సెట్ చేసిన విజయేంద్ర ప్రసాద్

  • హిట్ చిత్రాల దర్శకుడిగా అట్లీ కుమార్
  • 'మెర్సల్'కి పనిచేసిన విజయేంద్ర ప్రసాద్
  • అప్పటి నుంచి పెరిగిన సాన్నిహిత్యం  
Atlee Kumar Movie

ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తరువాత సినిమాను ఆయన అట్లీకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడనే వార్త ఒకటి కొన్ని రోజులుగా షికారు చేస్తోంది. ఎన్టీఆర్- అట్లీకుమార్ కాంబినేషన్ ఎలా సెట్ అయిందబ్బా అనే సందేహం అభిమానులకు రావడం సహజం.

తమిళంలో విజయ్ హీరోగా అట్లీ కుమార్ 'మెర్సల్' (అదిరింది) సినిమా చేశాడు. ఆ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ స్క్రీన్ ప్లే ను సమకూర్చారు. అప్పటి నుంచి అట్లీ కుమార్ కి .. విజయేంద్ర ప్రసాద్ కి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సమయంలోనే తన దగ్గరున్న ఒక కథను గురించి అట్లీ కుమార్ .. విజయేంద్ర ప్రసాద్ కి చెప్పాడట. ఆ కథ ఎన్టీఆర్ కి పెర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పి, ఆ ఇద్దరినీ కూర్చోబెట్టింది విజయేంద్ర ప్రసాద్ అని అంటున్నారు. ఆ కథతోనే అట్లీ కుమార్ .. ఎన్టీఆర్ ను ఒప్పించాడని చెప్పుకుంటున్నారు.

More Telugu News