Naga Chaitanya: విక్రమ్ కుమార్ తో చైతూ మూవీ ఖాయమైపోయినట్టే!

  • చైతూ తాజా చిత్రంగా రానున్న 'లవ్ స్టోరీ'
  • ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లని 'నాగేశ్వర రావ్'
  • విక్రమ్ కుమార్ కి గ్రీన్ సిగ్నల్
Vikram Kumar Movie

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ చేసిన 'లవ్ స్టోరీ' ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన పరశురామ్ దర్శకత్వంలో 'నాగేశ్వరరావ్' చేయవలసి వుంది. కానీ పరశురామ్ .. మహేశ్ బాబు ప్రాజెక్టుపైకి వెళ్లడంతో, 'నాగేశ్వరరావ్' సెట్స్ పైకి వెళ్లడానికి చాలా సమయమే వుంది.

ఈ లోగా చైతూని విక్రమ్ కుమార్ సంప్రదిస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేసింది. చైతూకి కథ నచ్చితే ఈ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశాలు వున్నాయనే ప్రచారం జరిగింది. కథ నచ్చడంతో విక్రమ్ కుమార్ కి చైతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనేది తాజా సమాచారం. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు. 'దిల్' రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరనే విషయంతో పాటు, మిగతా వివరాలు త్వరలో తెలియనున్నాయి.

More Telugu News