బన్నీ మూవీలో బాలీవుడ్ విలన్
- ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో 'పుష్ప'
- పోలీస్ ఆఫీసర్ పాత్రలో విజయ్ సేతుపతి
- ఐదు భాషల్లో విడుదల
ఈ సినిమాలో ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కీలకమైన పాత్రను చేయనున్నాడనేది తాజా సమాచారం. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో కనిపించనున్నట్టు తెలుస్తోంది. సంజయ్ దత్ .. జాకీ ష్రాఫ్ .. సునీల్ శెట్టి పేర్లను సుకుమార్ పరిశీలిస్తున్నాడట. ఈ ముగ్గురిలో ఒకరిని ఆయన సెట్ చేయనున్నాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.