పవన్ తో క్రిష్ మూవీ .. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగేకథ!

Viroopaksha Movie
  • క్రిష్ దర్శకత్వంలో 'విరూపాక్ష'
  • మొఘల్ చక్రవర్తుల కాలంలో సాగే కథ
  • ఔరంగజేబు పాత్రలో అర్జున్ రాంపాల్ 
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ ఒక సినిమాను ప్లాన్ చేశాడు. చారిత్రక నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. దొంగ పాత్రలో పవన్ కనిపిస్తాడనే టాక్ బయటికి వచ్చింది. మొఘల్ చక్రవర్తుల కాలంలో ఈ కథ నడుస్తుందనేది తాజా సమాచారం. ఇక పవన్ కనిపించేది కూడా సాధారణమైన దొంగగా కాదు .. కోహినూర్ వజ్రాన్ని కాజేయడానికి ప్రయత్నించే ఘరానా దొంగగా అని తెలుస్తోంది.

కథ అంతా కూడా కోహినూర్ వజ్రం చుట్టూనే తిరుగుతుందని చెబుతున్నారు. ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఒక కథానాయికగా జాక్విలిన్ ను తీసుకున్నారు. ఔరంగజేబు సోదరి పాత్రలో ఆమె కనిపించనుందని అంటున్నారు. పవన్ .. జాక్విలిన్ కి మధ్య ట్రాక్ ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ సినిమాకి 'విరూపాక్ష' అనే టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Pavan kalyan

More Telugu News