Junior NTR: 10 రోజులకి 5 కోట్ల పారితోషికం అందుకుంటున్న అలియాభట్!

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్' 
  • చరణ్ సరసన అలియా భట్ 
  • పారితోషికంగా రోజుకు 50 లక్షలు 
RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో 'రౌద్రం రణం రుధిరం' చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా చరణ్ నటిస్తుండగా, ఆయన జోడీగా అలియా భట్ కనిపించనుంది. త్వరలో ఆమె ఈ సినిమా షూటింగులో పాల్గొననుంది. ఈ సినిమా కోసం ఆమె అందుకోనున్న పారితోషికమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమా కోసం అలియా భట్ 10 రోజుల కాల్షీట్స్ ను కేటాయించిందట. ఈ 10 రోజులకిగాను పారితోషికంగా ఆమె 5 కోట్లు అందుకోనున్నట్టు తెలుస్తోంది. అంటే రోజుకి 50 లక్షల రూపాయలను చార్జ్ చేస్తుందన్న మాట. వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనుండటం వలన, ఆమె ఈ స్థాయి పారితోషికాన్ని డిమాండ్ చేసిందని అంటున్నారు. తెలుగు సినిమాకిగాను ఈ స్థాయి పారితోషికాన్ని అందుకున్న కథానాయిక అలియానే అని అంటున్నారు.

More Telugu News