మహేశ్ నిర్ణయం సరైనదేనంటున్న ఫ్యాన్స్
- ముందుగా మహేశ్ కి కథ వినిపించిన సుకుమార్
- అంతగా ఆసక్తిని చూపని మహేశ్
- బన్నీ లుక్ రిలీజ్ .. టైటిల్ రివిల్
మహేశ్ బాబు ఈ ప్రాజెక్టును ఎందుకు ఒప్పుకోలేదా అనే ఆలోచనలో పడిన అభిమానులు, ఆయన తీసుకున్న నిర్ణయం సరైనదేననే అభిప్రాయాన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ బాబుకి ఇంత మొరటు లుక్ సెట్ కాదనీ, అలాగే 'పుష్ప' అనే టైటిల్ కూడా ఆయనకి సెట్ కాదని అంటున్నారు. ఈ పాత్రకి మహశ్ రంగు .. ఆయన ఇమేజ్ కి ఈ టైటిల్ నప్పేవి కావని చెబుతున్నారు. ఈ రెండింటి కారణంగా మహేశ్ బాబు ఈ ప్రాజెక్టును వదులుకోవడం మంచిదే అయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.