Vaishnav Tej: 'ఉప్పెన' నుంచి విజయ్ సేతుపతి లేటెస్ట్ లుక్

  • గ్రామీణ నేపథ్యంలో సాగే కథ
  • దేవిశ్రీ సంగీతం ప్రత్యేక ఆకర్షణ
  • ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి
Uppena Movie

వైష్ణవ్ తేజ్ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో 'ఉప్పెన' రూపొందింది. ఈ నెల 2వ తేదీన విడుదల కావలసిన ఈ సినిమా వాయిదా పడింది. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో కథానాయికగా కృతిశెట్టి అలరించనుంది. ఆమె తండ్రిగా .. ప్రతినాయకుడిగా 'రాయనం' పాత్రలో విజయ్ సేతుపతి నటించాడు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ కానుందని అంటున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి విజయ్ సేతుపతి లుక్ ను రిలీజ్ చేశారు. కాలు మీద కాలేసుకుని విజయ్ సేతుపతి సిగరెట్ తాగుతున్న ఈ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఈ స్టిల్ ను బట్టే ఈ సినిమాలో ఆయన పాత్ర స్వభావాన్ని అంచనా వేయవచ్చు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు. ఈ ప్రేమకథా చిత్రం మ్యూజికల్ హిట్ గా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News