Harish Shankar: హరీశ్ శంకర్ తో బన్నీ మరో మూవీ?

Allu Arjun
షార్ట్స్‌లో చూడండి
తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుల జాబితాలో హరీశ్ శంకర్ కూడా కనిపిస్తాడు. మాస్ ఆడియన్స్ మెచ్చే అన్ని అంశాలు తన కథలో ఉండేలా చూసుకోవడంలో హరీశ్ శంకర్ సిద్ధహస్తుడు. ఆ మధ్య అల్లు అర్జున్ తో 'దువ్వాడ జగన్నాథం' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఆయన భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ ఉందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

నిన్న హరీశ్ శంకర్ పుట్టినరోజు కావడంతో, అల్లు అర్జున్ కాల్ చేసి మాట్లాడాడట. ఈ విషయాన్ని బన్నీనే స్వయంగా చెప్పడం విశేషం. ఈ సమయంలోనే తమ కాంబినేషన్లో మరో సినిమాను పట్టాలెక్కిస్తే బాగుంటుందనే విషయాన్ని గురించి ఇద్దరూ మాట్లాడుకుని ఉంటారని అంటున్నారు. ప్రస్తుతం బన్నీ కమిట్ అయిన సినిమాలు పూర్తవ్వగానే ఈ ఇద్దరి కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కే ఛాన్స్ లేకపోలేదని అంటున్నారు.
Go Back to Shorts
Harish Shankar
Allu Arjun
Tollywood

More Telugu News