Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Kajal watching Ramayan on the tube
షార్ట్స్‌లో చూడండి
 *  కథానాయిక కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు తన చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయట. దానికి కారణం ఏమిటంటే, ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల తను ఇంట్లోనే వుండి, దూరదర్శన్ ప్రసారం చేస్తున్న రామాయణ్, మహాభారత్ సీరియల్స్ చూస్తోంది. 'ఈ సీరియల్స్ చూస్తుంటే, నా చిన్నప్పటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలసి చూస్తూ వీటిని ఆస్వాదిస్తున్నాను' అని చెప్పింది.
*  రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన యూరప్ షెడ్యూలు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన సంగతి విదితమే. అయితే, ఈ సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం యూనిట్ వాడుకుంటోంది. షూటింగ్ జరిగిన భాగానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రస్తుతం నిర్వహిస్తున్నారు.
*  రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న 'రెడ్' చిత్రంలో హెబ్బా పటేల్ ఓ ఐటెం సాంగును చేసిన సంగతి తెలిసిందే. అయితే, కేవలం పాటలోనే కాకుండా ఈ సినిమాలో రెండు మూడు సన్నివేశాలలో కూడా హెబ్బా కనిపిస్తుందని అంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడింది.
Go Back to Shorts
Kajal Agarwal
Prabhas
Radhakrishna
Ram

More Telugu News