ఎల్పీజీ గ్యాస్ డెలివరీ సిబ్బంది ఎవరైనా ‘కరోనా’తో మరణిస్తే ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా
- భారత చమురు సంస్థలు ఓ కీలక నిర్ణయం
- ఐఓసీ, బీపీసీఎల్, హిందూస్థాన్ పెట్రోలియం ప్రకటన
- ఎక్స్ గ్రేషియా మొత్తం ఒకేసారి చెల్లిస్తామన్న సంస్థలు
ఈ విషయమై ఆలోచించిన ఎల్పీజీ పంపిణీ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. గ్యాస్ పంపిణీ చేసే డెలివరీ బాయ్స్, షోరూమ్ సిబ్బంది, గోడౌన్ కీపర్స్, మెకానిక్ లు ఎవరైనా ‘కరోనా’ సంబంధిత లక్షణాలతో ప్రాణాలు కోల్పోతే వారికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని ప్రకటించాయి. ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని అధికారిక ప్రకటన ద్వారా తెలిపాయి.