మంచు విష్ణు 'మోసగాళ్లు' అప్ డేట్

Mosagallu Movie
  • విష్ణు కథానాయకుడిగా 'మోసగాళ్లు'
  • ప్రతినాయకుడిగా సునీల్ శెట్టి
  • జూన్ 5వ తేదీన విడుదల  
మంచు విష్ణు కథానాయకుడిగా ఆయన సొంత బ్యానర్లో 'మోసగాళ్లు' సినిమా రూపొందుతోంది. జెఫ్రీ గీ చిన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో .. పూర్తి వినోదభరితంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కాజల్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.

నవీన్ చంద్ర .. నవదీప్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. జూన్ 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేయాలని విష్ణు భావించాడు. అయితే కరోనా కారణంగా చాలా సినిమాలు తమ విడుదల తేదీలను మార్చుకుంటూ వస్తున్న నేపథ్యంలో, ఈ సినిమా విడుదల తేదీ కూడా మారొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆలోగా కరోనా అదుపులోకి వస్తే మాత్రం అదే తేదీన విడుదల చేయాలనే నిర్ణయంతో విష్ణు వున్నాడని అంటున్నారు.
Go Back to Shorts
Manchu Vishnu
Kajal Agarwal
Sunil Shetty
Mosagallu Movie

More Telugu News