Telangana: తెలంగాణలో 'కరోనా' కంట్రోల్‌ రూం నంబర్లు ఇవిగో!

  • విదేశాల నుంచి వచ్చిన వాళ్లు స్వచ్ఛందంగా వివరాలు తెలపాలి
  • దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్లు కూడా
  • 040- 23450624, 040-23450735  నంబర్లకు వివరాలు చెప్పాలి
 In the wake of Corona virus Telangana state announces Control Room Numbers

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల నిమిత్తం విదేశాల నుంచి లేదా దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వారు స్వచ్ఛందంగా తమ వివరాలను తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా కంట్రోల్ రూమ్ నెంబర్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వైరస్ కు సంబంధించిన అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణమే ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేయాలని కోరింది. కంట్రోల్ రూమ్ కాంటాక్టు నెంబర్స్ వివరాలు..040- 23450624, 040-23450735 గా పేర్కొంది.

More Telugu News