కాబూల్ లోని గురుద్వారాలో ప్రార్థనలు చేస్తున్న సిక్కులపై ఉగ్రదాడి.. 11 మంది దుర్మరణం
- ప్రార్థనలో 150 మంది సిక్కులు
- కాల్పులు తమ పనేనన్న ఐసిస్
- తీవ్రంగా ఖండించిన భారత్
దాడి సమయంలో గురుద్వారాలో 150 మంది సిక్కులు ప్రార్థనలు చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాల్పులు జరిపింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ (ఐసిస్) ప్రకటించింది. కాగా, గురుద్వారాపై ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌తో పోరాడుతున్న వేళ ఇలాంటి దాడులు క్రూరమైనవని ఆగ్రహం వ్యక్తం చేసింది.