Rajamouli: రాజమౌళి తదుపరి సినిమా రామ్ తోనా? రానా తోనా?

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • ఓ మాదిరి బడ్జెట్ లోనే తదుపరి సినిమా 
  • కథను రెడీ చేసిన విజయేంద్ర ప్రసాద్   
Rajamouli Movie

రాజమౌళి తాజా చిత్రంగా 'ఆర్ ఆర్ ఆర్' రూపొందుతోంది. ఎన్టీఆర్ .. చరణ్ ప్రధాన పాత్రలను పోషిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను జరుపుకుంది. అత్యధిక బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాను, ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమా ఏ హీరోతో వుండనుందనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. రాజమౌళి తదుపరి సినిమా మీడియం బడ్జెట్ లోనే రూపొందుతుందనీ, హీరోగా రానాగానీ .. రామ్ గాని ఉండొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఈ సినిమాకి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేయడం జరిగిపోయిందని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.

More Telugu News