ఆ సూచన పాటిస్తే అంతే సంగతులు!: సాధినేని యామిని

Sadineni Yamini take a dig at CM Jagan
  • కరోనాకు పారాసెటిమల్ వేసుకోవాలన్న సీఎం జగన్!
  • ప్రజల ప్రాణాలతో సీఎం చెలగాటమాడుతున్నారని యామిని విమర్శలు
  • పారాసెటిమల్ వేసుకుంటే ప్రాణాలకు ముప్పు ఉంటుందని వ్యాఖ్యలు
కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ఒక పారాసెటిమల్ మాత్ర చాలని ఏపీ సీఎం జగన్ చెప్పడాన్ని బీజేపీ మహిళా నేత సాధినేని యామిని తప్పుబట్టారు. కరోనాను ఎదుర్కొనేందుకు పారాసెటిమల్ మాత్ర వేసుకుంటే అది ప్రాణాలకే ముప్పుగా పరిణమించే అవకాశముందని వ్యాఖ్యానించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోతుందంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ కరోనా వైరస్ పై పోరాటం కంటే స్థానిక ఎన్నికలే ముఖ్యం అనుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పై సీఎం వ్యాఖ్యలు సరికాదని అన్నారు. ఏకవచనంతో కమిషనర్ ను సంబోధించడం సీఎంకు తగదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు వచ్చిన విపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా అధికార పార్టీ వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు.
Go Back to Shorts
Sadineni Yamini
Jagan
Paracetmal
Corona Virus
COVID-19
Andhra Pradesh

More Telugu News