పెళ్లికి వెళ్లి వస్తుండగా దారుణం.. ఆటో బోల్తాపడి నలుగురు దుర్మరణం

Four dead in Road Accident in Srikakulam Dist
శ్రీకాకుళం జిల్లాలో ఆటో బోల్తాపడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులను జిల్లాలోని సరుబుజ్జిలి మండలం కొత్తకోట వాసులుగా గుర్తించారు.

నరసన్నపేటలో జరిగిన తమ బంధువుల పెళ్లి వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరిగి వస్తుండగా బైరికూడలి వద్దకు రాగానే ఆటో ఒక్కసారిగా బోల్తాపడింది. ఈ ఘటనలో తండ్రీకొడుకులైన వెంకటి, సింహాచలంతోపాటు శ్రీలత అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, గణేశ్ అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Srikakulam District
Road Accident
RIMS
Andhra Pradesh

More Telugu News