Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్'లో ఎన్టీఆర్ మూడు గెటప్స్ లో కనిపిస్తాడట!

  • షూటింగు దశలో 'ఆర్ ఆర్ ఆర్'
  • ఎన్టీఆర్ పాత్రలో ఎన్నో విశేషాలు 
  • చరణ్ పాత్రలో ఎన్నో ప్రత్యేకతలు  
RRR Movie

రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా షూటింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ - చరణ్ అభిమానులు ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఆసక్తిని చూపుతున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించనున్నాడు. ఇక కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ పోషిస్తున్నాడు.

ఈ సినిమాలో ఆయన కొమరం భీమ్ గెటప్పులోనే కాకుండా, కథా పరంగా మరో రెండు గెటప్పుల్లో కనిపించనున్నట్టు తాజా సమాచారం. ఆ రెండు గెటప్పులు .. వాటి తాలూకు సన్నివేశాలు ఉత్కంఠభరితంగా వుంటాయని అంటున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్స్ .. తెలంగాణ యాసతో కూడిన ఆయన డైలాగ్స్ .. హైలైట్ గా నిలవనున్నాయని చెబుతున్నారు. ఇక చరణ్ పాత్ర వైపు నుంచి కూడా ఎన్నో ప్రత్యేకతలను జోడిస్తూ వస్తున్నారు. వివిధ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో వున్నాయి.

More Telugu News