Rajinikanth: రజనీకాంత్ ఇంటి వద్ద అభిమానుల సందడి.. ‘తలైవా’ ప్రకటన కోసం ఉత్కంఠగా ఎదురుచూపు!

Rajinikanth greets fans gathered outside his residence
షార్ట్స్‌లో చూడండి
నేడు తన మనసులోని మాటను బయటపెడతానంటూ తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ అయ్యాయి. ఆయన ప్రకటన కోసం ఇటు అభిమానులు, అటు రాజకీయ పార్టీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులు ఈ ఉదయం నుంచే చెన్నై, పోయెస్ గార్డెన్ లోని రజనీ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఆయన చెప్పబోయే విషయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

రజనీకాంత్ వారం రోజుల క్రితం రజనీ మక్కల్ మండ్రం (ఆర్ఎంఎం) జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు. నేడు మరోమారు వారితో భేటీ కానుండడంతో అందరి దృష్టి ఒక్కసారిగా అటువైపు మళ్లింది. వారితో భేటీ తర్వాత ‘తలైవా’ కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. జిల్లా కార్యదర్శులతో భేటీ అనంతరం రజనీకాంత్ విలేకరులతో మాట్లాడతారని సమాచారం. అసెంబ్లీ ఎన్నికలకు తమిళనాడు సిద్ధమవుతున్న వేళ.. రజనీ తన రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Go Back to Shorts
Rajinikanth
Tamil Nadu

More Telugu News