Varun Tej: ఫస్టు షెడ్యూల్ పూర్తిచేసిన వరుణ్ తేజ్

Varun Tej completes first schedule of Kiran Korrapati Movie
షార్ట్స్‌లో చూడండి
'గద్దల కొండ గణేశ్' తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వరుణ్ తేజ్, ఇటీవలే తదుపరి సినిమా షూటింగ్ నిమిత్తం సెట్స్ పైకి వెళ్లాడు. అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన సరసన సయీ మంజ్రేకర్ కథానాయికగా కనిపించనుంది.

క్రితం నెల 24వ తేదీన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ వైజాగ్ లో మొదలైంది. అలా రెండు వారాల పాటు ఏకధాటిగా సాగిన ఈ షెడ్యూల్ నిన్ననే ముగిసింది. వరుణ్ తేజ్ .. ముఖ్య పాత్రధారుల కాంబినేషన్లోని కొన్ని సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు. త్వరలోనే మరో షెడ్యూల్ ను ఆరంభించనున్నారు. 35 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ డిఫరెంట్ లుక్ తో కనిపించనుండటం విశేషం.
Go Back to Shorts
Varun Tej
Sayee Manjrekar
Kiran Korrapati Movie

More Telugu News