గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు
- అంతర్జాతీయ మార్కెట్లో కుప్పకూలిన క్రూడాయిల్ ధరలు
- చమురు కంపెనీలపై తీవ్ర ప్రభావం
- 13.65 శాతం వరకు పతనమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు
రిలయన్స్ ఇండస్ట్రీస్ కు జామ్ నగర్ లో ప్రపంచంలోనే అతి పెద్ద క్రూడాయిల్ రిఫైనరీ పరిశ్రమ ఉంది. కృష్ణా, గోదావరి బేసిన్ లో పెద్ద ఎత్తున చమురు వెలికితీస్తోంది. ఈ నేపథ్యంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఈరోజు కుప్పకూలాయి. మధ్యాహ్నం 2.14 గంటల సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 12.05 శాతం నష్టంతో రూ. 1,117 వద్ద కొనసాగుతున్నాయి.