హాంకాంగ్ లో కుక్కకు కరోనా వైరస్.. మనిషి నుంచి జంతువుకు పాకిన తొలి కేసుగా రికార్డ్!
- హాంకాంగ్ లో తొలి కేసు నమోదు
- జంతువుల క్వారంటైన్ లో చికిత్స
- ఐసొలేషన్ లో మరో రెండు కుక్కలు
గత శుక్రవారం హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్ ను ఏర్పాటు చేసింది. వైరస్ బారిన పడిన జంతువులను 14 రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ కరోనా వైరస్ సోకిందని అనుమానిస్తున్న మరో రెండు కుక్కలను ఐసొలేషన్ లో ఉంచారు. ఈ రెండు కుక్కలలో ఒక దానికి కరోనా నెగెటివ్ అని తేలింది. దానికి మరోసారి పరీక్ష నిర్వహించి, మళ్లీ నెగెటివ్ అని తేలితే ఐసొలేషన్ నుంచి విడుదల చేయనున్నారు. మరో కుక్క గురించి వివరాలు తెలియాల్సి ఉంది.