Nikhil: నిఖిల్ మూవీ టైటిల్ '18 పేజెస్'

  • సూర్యప్రతాప్ తో నిఖిల్ 
  •  సుకుమార్ కథాకథనాలు 
  • నిర్మాతగా బన్నీ వాసు 
Surya Prathap Movie

ఒక వైపున చందూ మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ 2' సినిమాను మొదలెట్టిన నిఖిల్, మరో వైపున సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ఇంకో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మాతగా ఈ సినిమా మొదలుకానుంది. ఈ సినిమాకి కథ - స్క్రీన్ ప్లేను సుకుమార్ అందించడం విశేషం.

ఈ సినిమాకి '18 పేజెస్' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించిన 'కుమారి 21F' విజయవంతం కావడంతో, ఆ సెంటిమెంట్ తో ఈ సినిమాలో టైటిల్ లోను నెంబర్ ఉండేలా సూర్యప్రతాప్ చూసుకున్నాడని చెప్పుకుంటున్నారు. విభిన్నమైన కథాకథనాలతో నిర్మితమవుతున్న ఈ సినిమా, నిఖిల్ కి మరో హిట్ ఇవ్వడం ఖాయమనే ఆభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News