శ్రీరెడ్డితో డేటింగ్ కు వెళ్లడంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్!
Add ap7am to your home Screen

శ్రీరెడ్డితో డేటింగ్ కు వెళ్లడంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్!

Ram Gopal Varmas reaction on Sri Reddys dating proposal
  • డేటింగ్ అంటే ఒకరితో కలిసి బయటకు వెళ్లడం
  • నేను ఎప్పుడూ ఒక అమ్మాయితో కలిసి బయటకు వెళ్లను
  • నా ఉద్దేశంలో పెళ్లి, అంత్యక్రియలు రెండూ ఒకటే
డేటింగ్ అంటే డెఫినిషన్ ప్రకారం ఓ రెస్టారెంటుకో, ఇంకొక చోటుకో ఒకరితో కలిసి బయటకు వెళ్లడమని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలిపారు. తాను ఎప్పుడూ ఓ అమ్మాయితో కలిసి బయటకు వెళ్లనని చెప్పారు. తాను లోపలకే వెళ్తానని... సినీ నటి శ్రీరెడ్డితో అయినా సరే తాను డేటింగ్ కు వెళ్లనని తెలిపారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వర్మతో డేటింగ్ చేయాలని ఉందని ఇటీవల శ్రీరెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే ప్రశ్నను సదరు యూట్యూబ్ ఛానల్ యాంకర్లు ప్రస్తావించగా ఆయన ఈ మేరకు స్పందించారు.

పెళ్లి విషయంపై ప్రశ్నించగా... ఈ మధ్యన తనను ఒకరు పెళ్లికి ఆహ్వానించారని... పెళ్లికి, అంత్యక్రియలకు తాను రానని చెప్పానని, ఇదే తన రూల్ అని వర్మ తెలిపారు. తన ఉద్దేశంలో ఈ రెండు ఒకటేనని... ఇక్కడ మనసు చచ్చిపోతుందని, అక్కడ మనిషి చచ్చిపోతాడని అన్నారు. ఒక్క శాతం తెలివి ఉన్నా పెళ్లి చేసుకోకూడదని... అనుభవంతో ఈ విషయం చెబుతున్నానని... తన మాట వినకపోతే ఆ తర్వాత మీ ఖర్మ అని చెప్పారు.
Ram Gopal Varma
Sri Reddy
Dating
Tollywood

More Telugu News