బహిరంగ సభలో కాళ్లు పట్టించుకున్న జేడీయూ ఎమ్మెల్యే

jdu legislator gets leg massage by partymen at a rally
  • బీహార్ లోని పాట్నాలో అనుచరులతో కాళ్లు పట్టించుకున్న ఎమ్మెల్యే కౌషల్ యాదవ్
  • ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ నిర్వహిస్తున్న సభలోనే ఘటన
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
బీహార్ లోని పాట్నాలో జరిగిన ఓ బహిరంగ సభలో జేడీయూ ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ పార్టీ కార్యకర్తలతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ గా మారింది. ఆ రాష్ట్ర సీఏం, జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన సభలో ఇలా చేయడం చర్చనీయాంశమైంది.

సభ ఆవరణలో..

బీహార్ లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారం కూడా మొదలుపెట్టాయి. ఈ క్రమంలో జేడీయూ తరఫున నితీష్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదాన్ లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. నవాడా నియోజకవర్గం ఎమ్మెల్యే కౌశల్ యాదవ్ సభా ప్రాంగణంలో కార్పెట్ పై కూర్చుున్నారు. కొంత సేపటి తర్వాత ఆయన అలసిపోయానంటూ ఓ కార్యకర్త ఒడిలో తలపెట్టుకుని అలాగే కార్పెట్ పై పడుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలు ఆయన కాళ్లు పట్టారు. మసాజ్ చేశారు.

జనం మధ్యలోనే..

అంత మంది జనం మధ్యలో ఓ ఎమ్మెల్యే ఇలా కార్యకర్తలతో కాళ్లు పట్టించుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని జాతీయ ఆంగ్ల మీడియా కూడా ప్రసారం చేసింది.
Go Back to Shorts
JDU
Bihar
Mla

More Telugu News