డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై ప్రత్యేక వీడియోను విడుదల చేసిన వైట్ హౌస్!
- ఈ వారం ప్రారంభంలో భారత పర్యటన
- రెండు రోజులు ఇండియాలో ఉన్న ట్రంప్
- పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు
అనంతరం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించి, అక్కడి నుంచి న్యూఢిల్లీ చేరుకున్నారు. మరుసటి రోజు ఢిల్లీలో పలు కీలక చర్చల్లో పాల్గొని, ఇండియాతో ద్వైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అపాచీ హెలికాప్టర్లను భారత్ కు అందించే కాంట్రాక్టుపై సంతకాలు చేశారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం తరువాత, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, తన గౌరవార్థం ఇచ్చిన విందుకు హాజరయ్యారు. విందు అనంతరం తిరిగి వాషింగ్టన్ కు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమం మొత్తానికి సంబంధించిన, వీడియోను వైట్ హౌస్ ట్వీట్ చేసింది.