ట్రంప్ తో విందుకు ప్రత్యేక అతిథి వచ్చింది... ఏఆర్ రెహమాన్ పోస్ట్ చేసిన ఫన్నీ వీడియో ఇదిగో!
Add ap7am to your home Screen

ట్రంప్ తో విందుకు ప్రత్యేక అతిథి వచ్చింది... ఏఆర్ రెహమాన్ పోస్ట్ చేసిన ఫన్నీ వీడియో ఇదిగో!

Mokey in Trumps Dinner
  • ఈ వారం ప్రారంభంలో ట్రంప్ పర్యటన
  • రాష్ట్రపతి విందుకు హాజరైన రెహమాన్
  • ఓ కోతి వస్తే, వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
ఈ వారం ప్రారంభంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన కుటుంబంతో సహా భారత్ లో పర్యటించగా, వారి గౌరవార్థం రాష్ట్రపతి ప్రత్యేక విందును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ విందుకు ప్రధాని, ఉప రాష్ట్రపతి, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇదే విందుకు హాజరైన ఆస్కార్ విన్నర్, ఏస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది.

అందరూ విందుకు కూర్చున్న వేళ, ఓ మర్కటం అక్కడికి వచ్చి, పూల కుండీ పక్కన కూర్చుని విందు ఆరగించింది. సదరు కోతి ఆకులను తింటుంటే, వీడియో తీసిన రెహమాన్, "ఓ చిట్టి స్నేహితుడు కూడా విందుకు వచ్చాడు" అని కామెంట్ చేస్తూ, దాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.
AR Rehaman
Donald Trump
Rashtrapathi
Dinner
Monkey
Instagram

More Telugu News